రెజ్లర్లు సాక్షి, అన్షు, బజరంగ్ & దీపక్ ఫైనల్స్‌కు చేరుకున్నారు

పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్ రామ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బజరంగ్ పునియా విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించాడు.

U-20 ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత్ కు రజత పతాకం

పురుషుల ఫ్రీస్టైల్‌ 86 కేజీల విభాగంలో దీపక్‌ పునియా కెనడాకు చెందిన అలెగ్జాండర్‌ మూర్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు.

విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ మెరుగైన కెప్టెన్

మోహిత్ గ్రేవాల్ తన పురుషుల ఫ్రీస్టైల్ 125 కేజీల సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కెనడాకు చెందిన అమర్‌వీర్ ధేసి చేతిలో ఓడిపోయాడు.

CWG-22 లో భారత్ కు మరో రజతం. 

మహిళల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన అన్షు మాలిక్ శ్రీలంకకు చెందిన నెత్మీ పొరుతోటగేపై ఆధిపత్య విజయంతో ఫైనల్‌లోకి ప్రవేశించింది. సాక్షి మాలిక్ కూడా ఫైనల్లోకి ప్రవేశించింది.

దివ్య కక్రా ఫ్రీస్టైల్ 68 కేజీల రెపిచేజ్ రౌండ్ 2లో కామెరూన్‌కు చెందిన బ్లాండైన్ నైహ్ న్‌గిరిని ఓడించింది. ఆమె కాంస్యం కోసం టోంగాకు చెందిన టైగర్ లిలీ కాకర్ లెమాలీతో ఆడుతుంది.

భారత రెజ్లర్లు రెజ్లింగ్‌లో తమ ప్రతిభను ప్రదర్శించి భారత్‌కు పతకాలను ఖాయం చేశారు.